Minor raped : సభ్య సమాజం తలదించుకునేలా.. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు దేశంలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా మైహర్ టౌన్ ఆర్కండీ టౌన్ షిప్ లో ఘోరం చోటుచేసుకుంది.
గురువారం పదకొండేళ్ల బాలిక కనిపించకుండా పోయింది.
రాత్రి వరకూ పాప ఇంటికి తిరిగి రాకపోవడంతో.. వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు..
అయితే ఆ టౌన్ షిప్ కు దగ్గర్లోనే ఉన్న అడవిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పాప స్థానికులకు కనిపించింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పాపను ఆసుపత్రికి తరలించారు.
Also read : Osmania Hospital: ఎట్టకేలకు మోక్షం.. ఇక ఉస్మానియా ఆస్పత్రి కూల్చుడే!
రక్తపు మడుగులో పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పాప ఒళ్ళంతా పంటిగాట్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పైన చావుబతుకుల మధ్య ఆ పాప కొట్టుమిట్టాడుతోంది. గ్యాంగ్ రేప్ కు సంబంధించిన ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి(Minor Raped) మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.