Site icon HashtagU Telugu

Minor Dalit: జార్ఖండ్‌లో దారుణం.. అత్యాచారం ఆపై వీడియో చిత్రీకరణ

Minor Dalit

Whatsapp Image 2023 05 21 At 11.08.22 Am

Minor Dalit: జార్ఖండ్‌లోని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 16 ఏళ్ళ బాలికను ఇంట్లోనుంచి బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసినట్టు బాధితురాలు తెలిపింది. దీంతో పోలీసులు ఒకర్ని అదుపులోకి తీసుకోగా.. ఐదుగురు పరారీలో ఉన్నట్టు స్థానిక పోలీసుల సమాచారం.

హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 16 ఏళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆరుగురు మృగాలు దళిత బాలికను ఇంట్లో నుంచి అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక వారిని వదిలించుకునే ప్రయత్నం చేయగా ఆ కిరాతకులు ఆ బాలికను తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె ఛాతి, వీపు, ప్రయివేట్ ప్రదేశంలో తీవ్ర గాయాలయ్యాయి. అదేకాకుండా అత్యాచారాన్ని యువకుడు వీడియో కూడా తీశాడని తెలిపింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్థులు నిందితుల్లో ఒకరైన దినేష్‌కుమార్‌ ఠాకూర్‌ను పట్టుకుని కొట్టారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఐదుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆరుగురు యువకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

బాధితురాలు ఎంఆర్‌ఎంసిహెచ్‌ మేదినీనగర్‌లో చికిత్స పొందుతోంది. చికిత్స కోసం ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కే రంజన్, డాక్టర్ విజేత సింగ్, డాక్టర్ జయంత్ ఘోష్, డాక్టర్ ఆశిష్ మరియు మరొకరితో సహా బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. .కాగా తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రహస్య స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు హుస్సేనాబాద్‌ ఎస్‌డిపిఓ పూజ్య ప్రకాష్‌ తెలిపారు. త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా ఈ దారుణం తాజాగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More: Rain Alert : నాలుగు రోజులు వానలు..50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

Exit mobile version