హైదరాబాద్ యూసఫ్‌గూడలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో అవిభక్త కవలలు వీణా-వాణిలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వారి లక్ష్యం ఏంటని అడగగా.. సీఏ కావాలని ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీణ, వాణి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో వీణా-వాణి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. (TSBIE) ప్రకటించిన ఫలితాల్లో వీణ 712 మార్కులు సాధించగా, వాణి 707 మార్కులు సాధించింది. ఇక 10వ తరగతిలో వీణ 9.3 జీపీఏ సాధించగా, వాణి 9.2 జీపీఏ సాధించింది. వీణా, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రులు సత్యవతి, సబితారెడ్డి తెలిపారు.
Veena & Vani: వీణా-వాణిలకు అభినందనల వెల్లువ!
అవిభక్త కవలలు వీణా-వాణిలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు.

Veena, Vani
Last Updated: 29 Jun 2022, 03:01 PM IST