MLC Kavitha:ఎమ్మెల్సీ కవితకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంఘీభావం

మ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు.

  • Written By:
  • Updated On - August 27, 2022 / 03:07 PM IST

మ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు.

ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. బిజెపి కార్యకర్తలు దాడి చేయటం దారుణమన్నారు, నిరాధారమైన ఆరోపణలపై కేవలం రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేయడాన్ని దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. సంస్కృతి సంప్రదాయాలు అనే పదే పదే మాట్లాడే బీజీపీ నాయకులు
ఓ మ‌హిళ నాయ‌కురాలి ఇంటిపై దౌర్జ‌న్యం చేయ‌డాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ? అని ప్రశ్నించారు వారు..

ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విప్ అరికెపూడి గాంధి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, నన్నపనేని నరేందర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కాలె యాదయ్య, రేఖా నాయక్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, పట్నం మహేందర్ రెడ్డి, కసి రెడ్డి నారాయణ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీబావం ప్రకటించారు.