Site icon HashtagU Telugu

Goutham Reddy: మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి.. మంత్రి కేటీఆర్ నివాళి

Ktr Goutham Reddy

Ktr Goutham Reddy

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శోకతప్త హృదయంతో మునిగిపోయింది. గౌత‌మ్ రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇక గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెల్పుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఉన్న గౌత‌మ్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్, గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ‌ గౌతమ్ రెడ్డి తండ్రి, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రావును ఓదార్చి, ధైర్యం చెప్పారు కేటీఆర్. ఆ త‌ర్వాత‌ మీడియాతో మాట్లాడిన కేటీఆర్, గౌతమ్ తనకు అత్యంత సన్నిహితుడని, గ‌త‌ 12 ఏళ్లుగా తమకు పరిచయం ఉందని, రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఎన్నోసార్లు కలుసుకున్నామని, ఓ మంచి స్నేహితుడుని కోల్పోయానని కేటీఆర్ అన్నారు. గౌతమ్ రెడ్డి ఆక‌స్మిక‌ మరణం గురించి తెలుసుకుని షాక్‌కు గురియ్యాయ‌ని, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాన‌ని కేటీఆర్ అన్నారు.