Site icon HashtagU Telugu

BRS Minister: 23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న: మంత్రి వేముల

Prashanth

Prashanth

BRS Minister: బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం సాయంత్రం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసిఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ… నేడు దేశానికే ఆదర్శమయ్యింది అన్నారు. కేసిఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందని దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. పదిలంగా ఉన్న తెలంగాణను తెలిసి పాడు చేసుకుంటామ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్,బీజేపీ నేతలవి బేకార్ మాటలనీ, వాళ్ళు ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైన చెప్తరు…ఓట్లు డబ్బల పడ్డాక మొఖం కూడా చూపించరనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో ప్రజలను పట్టించుకోనివారు…నేడు అదే ప్రజలను ఓట్లు అడగడానికి వస్తూ.. అడ్డగోలు విమర్శలు చేస్తున్నారనీ మండిపడ్డారు.

ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన పాపానికి రైతులు కరెంట్ లేక గోస పడుతున్నారని, తెలంగాణ రైతులు మోస పోవద్దని అక్కడి రైతులు ఇక్కడికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మరీ చెప్తున్నారని గుర్తు చేశారు. 23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న కుటుంబం నాదనీ,ఎన్నడూ పదవుల కోసం పక్కకు చూడలేదని మంత్రి వేముల భావోద్వేగానికి లోనయ్యారు. గత 23 ఏళ్లుగా కేసీఆర్ గారి మాట జవదాటకుండా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నామని, తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు పార్టీ కోసం ,ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు.

23 ఏళ్లుగా పార్టీ కోసం కేసిఆర్ గారి ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టే కేసిఆర్ కు తాను అంటే ఇష్టమన్నారు. అందుకే కేసీఆర్ గారి దయ వల్ల అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులు సాధ్యం చేసుకున్నామన్నారు. తాను ఈ ప్రాంతానికి చేస్తున్న మంచి తనకు ఎంతో ఆత్మ సంతృప్తి నిచ్చిందనీ, ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు. నేను పుట్టిన ఈ వేల్పూర్ గడ్డ నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నదనీ,రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు చూపించే ప్రేమే కారణమన్నారు. మీరిచ్చే ధైర్యం చూస్తుంటే..మూడో సారి భారీ మెజార్టీతో గెలుస్తా అనే ధీమా ఉన్నదనీ, ప్రజల ఆశీర్వాదం ,కార్యకర్తల అండ ఉన్నన్ని రోజులు బి అర్ ఎస్ దే విజయమన్నారు.

Exit mobile version