Site icon HashtagU Telugu

Minister Vemula: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Nomination

TPCC President Revanth Reddy announced Congress manifesto released date

అమర జ్యోతి నిర్మాణంతో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వి మతిలేని మరగుజ్జు మాటలని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచితమనస్తత్వంతో ఉన్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జ్యోతి నిర్మాణం కేసిఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా మనసు పెట్టి నిర్మించిందని,ఓట్ల రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. ఒకసారి రేవంత్ రెడ్డి 6అంతస్థుల అమర జ్యోతి సందర్శించి అక్కడ ఏర్పాట్లు చూస్తే నిర్మాణ గొప్పతనం అర్థమవుతుందని సూచించారు. తెలంగాణ అమర వీరుల త్యాగాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని తేల్చి చెప్పారు. అసలు అమరుల బలిదానాలు జరిగిందే కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం,గందరగోళ ప్రకటనల వల్ల అని విమర్శించారు. చంపిందే సోనియా గాంధీ అని 2004 లో టిఆర్ఎస్ తో పెట్టుకొని..మాట ఇచ్చి కామన్ మినిమం ప్రోగ్రాం(CMP)లో పెట్టి మాట తప్పారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి వెనక్కు తీసుకున్నారు.

అందుకే బలిదానాలు అయినాయి అని మంత్రి గుర్తు చేశారు. విద్యార్థులను సోనియా గాంధీ బలి తీసుకుంటుంది ఆమె తెలంగాణ బలి దేవతా అని నాడు మాట్లాడిన రేవంత్…అమరుల కుటుంబాలతో సోనియా గాంధీ సహపంక్తి భోజనాలు చేస్తుందనడం విడ్డూరంగా,విచిత్రంగా ఉందన్నారు. మేమే చంపామని పాపప్రాయచిత్తం చేసుకుంటారా అని ప్రశ్నించారు. సహపంక్తి బోజనాలు కాదు.. అమరుల కుటుంబాల పాదాలు కడిగి నీళ్లు నెత్తినజల్లుకున్న కాంగ్రెస్ చేసిన పాపం పోదని మంత్రి ఎద్దేవా చేసారు. అమర జ్యోతి లాంటి నిర్మాణం కాంగ్రెస్ వల్ల కాదు..ఆ మనసు వారికి లేదన్నారు. కేసిఆర్ ప్రభుత్వం యావత్ తెలంగాణ సమాజం గర్వించే రీతిలో పూర్తి పారదర్శకంగా అమర జ్యోతి నిర్మించిందని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ భారత స్వాతంత్ర్య అమరవీరులకు ఒక స్మారకాన్ని ఢిల్లీలో ఎందుకు కట్టించలేదని మంత్రి ప్రశ్నించారు.

కేసిఆర్,కెటిఆర్ ను వ్యక్తి గతంగా తిడితే వార్తల్లో ఉంటాననే ఆరాటంతో రేవంత్ పసలేని ఆరోపణలు చేస్తున్నాడని,బ్లాక్ మెయిలర్ తో నీతులు చెప్పించు కోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ఉద్యమకారులపైకి పిట్టలదొరలా తుపాకీతో వెళ్లిన నీవా అమరవీరుల గురించి మాట్లాడేది,నీవు అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయి.అమరుల త్యాగాల గురించి అసలు రేవంత్ రెడ్డి కి ఏం తెలుసని మాట్లాడుతున్నడని అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న చర్లపల్లి జైలును రేవంత్ పదే పదే కలవరిస్తున్నడని అన్నారు. నోరు అదుపులో పెట్టుకో రేవంత్..మా నాయకుని పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు..ఖబర్ధార్ అంటూ మంత్రి మరో మారు ఘాటుగా హెచ్చరించారు.

Exit mobile version