Minister Uttam Kumar Reddy Father Passes Away: నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పురుషోత్తంరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , ఇతర నేతలు సంతాపం తెలిపారు. వీరితో పాటు వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి మృతి పట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, వివిధ పార్టీల నేతలు ఉత్తమ్ నివాసానికి చేరుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ తండ్రి పురుషోత్తం రెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ నివాసానికి చేరుకొని పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
Read Also : Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హత్యపై యూఎన్‌కు ఇరాన్.. ఇజ్రాయెల్ తప్పేం లేదన్న అమెరికా