రేపటి నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి తలసాని జీహెచ్ఎంసీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలను కోరారు. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కాకుండా నిమజ్జనం చేయాలని కోరారు.
నెక్లెస్ రోడ్ లోని బుద్ధ భవన్ లో GHMC నార్త్ జోన్ స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/O7PnalzXrP
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 30, 2022