Site icon HashtagU Telugu

Talasani On Modi: పీఎంను సీఎం రిసీవ్ చేసుకోవాలనే రూలేమీ లేదు!

Talasani

Talasani

బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడయాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మోడీని ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అని ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి స్వాగతం పలకడం లేదని ఎక్కడా లేదు. ప్రొటోకాల్ ప్రకారం క్యాబినెట్ ఎవరో ఒకరు రిసీవ్ చేసుకుంటే సరిపోతోందని సమాధానమిచ్చారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు సిన్హాను బలపర్చాయని, అందుకే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ కు మద్దతు ఇస్తుందని తలసాని తెలిపారు. ఆయన నామినేషన్ కు మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారని, తెలంగాణలో సిన్హా టూర్ ముందుగానే నిర్ణయించిందని, ప్లాన్ ప్రకారం నిర్వహించిన కార్యక్రమం కాదనీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. డెవలప్ మెంట్ ను పూర్తిగా విస్మరించిన మోడీ ప్రభుత్వం ఈడీ, ఐటీ అంటూ భయపెడుతుందని, మర్యాద అనేది ఇచ్చు పుచ్చుకోవాలని తలసాని ఈ సందర్భంగా అన్నారు.