Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘‘ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారు’’ అని మంత్రి […]

Published By: HashtagU Telugu Desk
Niranjan Reddy

Niranjan Reddy

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘‘ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారు 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారు’’ అని మంత్రి అన్నారు.

‘‘జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉన్నది. రీ డిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయి. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద కేసీఅర్ దృష్టిపెట్టారు. ప్రతిపక్షాలు అవనసరంగా విష ప్రచారం చేయొద్దు’’ అని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Also Read: MLC Kavitha: 26న జలవిహార్ లో బీసీ సంఘం సమావేశానికి మద్దతు: ఎమ్మెల్సీ కవిత

  Last Updated: 23 Sep 2023, 05:10 PM IST