TS: పాఠశాలల పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి కీలక నిర్ణయం..!!

కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించినట్లుగానే ఈనెల 13న పాఠశాలలు పునప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 07:48 PM IST

దేశంలో మళ్లీ కోవిడ్ మహమ్మారి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ రోజువారీ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళణ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా విద్యాసంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి ఏర్పడింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది.

కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించినట్లుగానే ఈనెల 13న పాఠశాలలు పునప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే పాఠశాలల పునప్రారంభంపై మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి ముందుకు కోవిడ్ పరిస్థితుల గురించి తెలిపారు. ఈనేపథ్యంలో మంత్రి అనుకున్న తేదీ ప్రకారమే విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు.