Site icon HashtagU Telugu

Sabita Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ!

Sabitha

Sabitha

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నిరసన సెగ తగిలింది. గత 15 రోజుల నుండి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ని కలిసి టెట్ అభ్యర్థుల సమస్యల పై వివరించేందుకు NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి పలుమార్లు ప్రయత్నించారు. అయితే సబితారెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట లో ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ విద్యార్థి నాయకులు మంత్రిని నేరుగా కలిసి వినతిపత్రం అందించాలనుకున్నారు. కానీ సబితా ఇంద్రారెడ్డి విముఖత చూపడంతో రంగా రెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో NSUI నాయకులు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లాజెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీర్ పేట పోలీసు స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించేవరకు తమ పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.

Exit mobile version