విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్ల పార్టీ వాళ్లు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు.పవన్ కళ్యాణ్ తమ పార్టీ వారిని అదుపులో పెట్టాలని, జనసేనను విమర్శిస్తే దాడులు చేస్తారా అని రోజా ప్రశ్నించారు.చిరంజీవినే ఇంటికి పంపారు పవన్ కళ్యాణ్ ఎంత అని రోజా ఎద్దేవా చేశారు.మేం అధికారంలో ఉన్నామని, తాము తలచుకుంటే తట్టుకుంటారా అని రోజా అన్నారు.అక్కడ జరిగిన దాడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యిందని,అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆమె చెప్పారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రోజా అన్నారు.
Minister Roja: చిరంజీవినే ఇంటికి పంపారు.. పవన్ కళ్యాణ్ ఎంత? మంత్రి రోజా!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Roja
Last Updated: 15 Oct 2022, 11:39 PM IST