Site icon HashtagU Telugu

Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న.. ఏమార్చడంలో ఎవర్‌గ్రీన్‌ చంద్రబాబు : రోజా

Roja

Roja

Roja: నిజాయితీకి నిలువుటద్దం జగనన్న అని, ఏమార్చడంలో ఎవర్‌గ్రీన్‌ చంద్రబాబు అని మంత్రి ఆర్కేరోజా అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని ఇరుగువాయి పంచాయతీ పరిధిలో ఇరుగువాయి, ఇరుగువాయి హరిజనవాడ, ఇరుగువాయి ఎస్టీ కాలనీ, పర్వతరాజపురం, పర్వతరాజపురం ఎస్టీ కాలనీలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మంగళ హరతులు పట్టారు. యువత జేజేలు పలికారు. ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిజాయితీతో నెరవేర్చే ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు.

అలాగే ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఏమార్చడంలో ఎవర్‌గ్రీన్‌ చంద్రబాబు అన్నారు. సంక్షేమం క్రమం తప్పకుండా మహిళల ఖాతాలకు పడుతోందని, పాలన చేరువగానే జరుగతోందని, వైద్యం అందుబాటులో ఉందని, విద్య మెరుగు పడిందని ఇది కాదా ప్రజా సంక్షేమం అన్నారు. ఇవంతా కొనసాగాంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగాలన్నారు.

నగరి నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయనివిదంగా అభివృద్ది చేస్తున్న తనను ఓటుతో ఆశీర్వదించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరు ఫ్యాన్‌ గుర్తు బటన్‌ను రెండు సార్లు నొక్కాలన్నారు. తనకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలని, మళ్లీ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version