Site icon HashtagU Telugu

RK Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. థ్యాంక్స్ చెబుతూ ‘కన్నీటి వీడ్కోలు’

Roja

Roja

ఏపీ మంత్రి ఆర్ కే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఈటీవీ, జబర్దస్త్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరి సారిగా జబర్దస్త్ కంటెస్ట్, నిర్వాహకులను కలుసుకొని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్స్ చెప్పే క్రమంలో కంటతడి పెట్టుకుకొని ఎమోషన్ అయ్యారు. ‘‘ నేను ఇక్కడ్నుంచే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యాను. నేను నమ్మాను కాబట్టే మంత్రిని అయ్యాను. సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైనవి చేయాలంటే.. నాకు ఇష్టమైనవి (జబర్దస్త్) వదులుకోవాల్సి వస్తోంది. నా గోల్ కు రీచ్ అయ్యేలా చేసిన ఈటీవీకి థ్యాంక్స్’’ అంటూ మినిస్టర్ రోజా ఎమోషన్ అయ్యారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టంతో ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొన‌రాద‌ని రోజా నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె వెల్ల‌డించారు. రోజా దాదాపు ప‌దేళ్ళుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మ‌న్ గా ఉన్న స‌మ‌యంలో కూడా ఆమె ఈ షో పాల్గొన్నారు. ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రావటంతో దీనికి గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌లేదు. మంత్రి ప‌ద‌వి రావ‌టంతో రోజా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జ‌గన్ ఇచ్చిన‌ మంత్రి ప‌ద‌వికి న్యాయం చేస్తా అని ప్ర‌క‌టించారు.