Pawan Kalyan : పవన్ .. ఓ దరిద్రుడు – మంత్రి రోజా

ప్యాకేజీ కోసమే ఊడిగం చేస్తున్నాడంటూ ఎద్దేవ చేశారు. అవినీతి కేసులో అరెస్టైన వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేస్తానిని ఓ దరిద్రుడు

Published By: HashtagU Telugu Desk
Minister RK Roja Fires on Pawan Kalyan

Minister RK Roja Fires on Pawan Kalyan

వైసీపీ మంత్రి రోజా (Minister RK Roja)..మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఏకంగా ఓ దరిద్రుడు ..ప్యాకేజీ స్టార్..దత్తపుత్రుడు ..జనసేన పార్టీ ని చంద్రసేనగా మార్చి బాబుకు ఊడిగం చేస్తున్నాడంటూ విమర్శించింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా చంద్రబాబు (Chandrababu) కు సపోర్ట్ గానే ఉంటున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో టీడీపీ కి సపోర్ట్ గా నిలిచి టీడీపీ విజయం లో భాగమయ్యారు. ఆ తర్వాత 2019 లో ఒంటరిగా బరిలోకి దిగి..ఓటమి చవిచూశారు. కానీ అప్పటి పవన్ కళ్యాణ్ కు ఇప్పటి పవన్ కళ్యాణ్ కు చాల తేడా ఉంది. రాజకీయంగానే కాకుండా పార్టీ పరంగా కూడా బలం పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈ ఐదేళ్ల లలో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎవర్ని అడిగిన ఈసారి మా మద్దతు పవన్ కళ్యాణ్ కే అని ముక్తకంఠం తో చెపుతున్నారు. పవన్ బలం పెరిగిన విషయం టీడీపీ , వైసీపీ పార్టీలు కూడా గుర్తించాయి. అందుకే టీడీపీ పవన్ తో స్నేహం చేస్తూ మద్దతు కోరుతూ వచ్చింది. చంద్రబాబు అంటే మొదటి నుండి అభిమానం ఉండడం తో పవన్ సైతం ఈసారి కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

Read Also : New Zealand: వేల అడుగుల ఎత్తు నుంచి పడిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందో తెలుసా?

ఇలా ఇద్దరి స్నేహం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో వైసీపీ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest)నేపథ్యంలో పవన్ సపోర్ట్ ఇస్తుండడం తో..వైసీపీ మరోసారి పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. తాజాగా మంత్రి రోజా (Minister RK Roja) మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతివ్వడంపై విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ కోసమే ఊడిగం చేస్తున్నాడంటూ ఎద్దేవ చేశారు. అవినీతి కేసులో అరెస్టైన వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేస్తానిని ఓ దరిద్రుడు అంటున్నాడని.. అతడు మరెవరో కాదని ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని సెటైర్లు వేశారు మంత్రి రోజా. జనసేన పార్టీ పెట్టి దానిని చంద్రసేనగా మార్చి బాబుకు ఊడిగం చేస్తున్నాడని దుయ్యబట్టింది. పవన్ వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి రోజా తెలిపింది. పొత్తు కోసం బీజేపీ కావాలంటాడు.. ప్యాకేజీ కోసం టీడీపీ కావాలంటాడని.. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏవిధంగా మద్దతిస్తారని మంత్రి రోజా మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది.

  Last Updated: 12 Sep 2023, 04:03 PM IST