Puvvada: యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం విరాళం!

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంత్రి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Puvvada

Puvvada

యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని విమాన గోపురానికి ఖమ్మం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 1కేజీ బంగారం, పట్టువస్త్రాలను కలెక్టర్‌ పమేలా సమక్షంలో అజయ్‌కుమార్‌ ఈఓ గీతకు అందజేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం మంత్రి, కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు ఆహ్వానించారు. అనంతరం పువ్వాడ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. ఆలయానికి కేజీ బంగారం అందించినందుకుగానూ ప్రత్యేకంగా సన్మానించారు.

  Last Updated: 19 Apr 2022, 09:08 PM IST