Site icon HashtagU Telugu

BJP vs YSRCP : పురంధేశ్వ‌రికి మంత్రి పెద్దిరెడ్డి కౌంట‌ర్‌.. ఆరోప‌ణ‌లు చేసే ముందు..?

Purandhareswari

Purandhareswari

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ ప్ర‌తినిధిగా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తరపున మాట్లాడితే పర్వాలేదని, అయితే మాట్లాడే ముందు సరైన వాస్తవాలు ఉండేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలకు చంద్రబాబు ఆమోదం తెలిపారని, ఈ విషయం పురంధేశ్వ‌రి తెలుసుకోవాల‌న్నారు. గ‌త కొద్ది రోజులుగా వైఎస్సార్‌సీపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయగా, పురంధేశ్వరిపై తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆరోపణలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆమె వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Also Read:  AP : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది జగనే – ధర్మాన కృష్ణ దాస్