Site icon HashtagU Telugu

UP Elections: రాజాసింగ్ ఓ క‌మెడియ‌న్.. కేటీఆర్ షాకింగ్ సెటైర్..!

Ktr Raja Singh

Ktr Raja Singh

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సెగ తెలంగాణ‌లో కూడా రాజుకుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. యూపీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో అక్క‌డి ఓట‌ర్ల‌ను ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓటువేయ‌ని వారిని గుర్తించి, వాది ఇళ్ళ‌ను జేసీబీ, బుల్‌డోజ‌ర్ల‌తో కూల్చేస్తామ‌ని రాజాసింగ్, యూపీ ఓట‌ర్ల‌కు డైరెక్ట్‌గా వార్నించారు.

ఎమ్మెల్యే  రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్, ఆయ‌న పై సెటైర్స్ వేశారు. బీజేపీ వాళ్ళు ఇంత‌కు మించి దిగ‌జారలేర‌ని అనుకున్న‌ప్పుడు, తెర‌పైకి ఓ అద్భుత‌మైన హాస్యన‌టుడు వ‌చ్చాడ‌ని, రాజాసింగ్ ఓ క‌మెడియ‌న్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ యూపీలో దేశద్రోహులకు బరాబర్ బుద్ది చెబుతామ‌ని ఈ క్ర‌మంలో వారి ఇళ్ళ‌ను నేల‌మ‌ట్టం చేస్తామ‌ని కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చారు. దీంతో యూపీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేత‌ల మ‌ధ్య నువ్వా నేనా అనేలా మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.

Exit mobile version