Telangana : అసెంబ్లీ లో ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంతకన్నా అభివృద్ధి జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 08:29 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) వాడివేడిగా నడుస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు కావడం తో మంత్రులు అన్ని విషయాల ఫై క్లుప్తంగా వివరణ ఇస్తున్నారు. నేడు సమావేశాల్లో మంత్రి కేటీఆర్ (KTR) ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టించారనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , ఇస్తున్న పెన్షన్లు , అందిస్తున్న సంక్షేమ పధకాలు , కట్టిన ప్రాజెక్టులు , భారీ వర్షాల సమయంలో తీసుకుంటున్న చర్యలు ఇలా ప్రతిదాని ఫై వివరణ ఇచ్చి ..ప్రతి పక్ష నేతలకు మాట రాకుండా చేసారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంతకన్నా అభివృద్ధి జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కాంగ్రెస్ , బిజెపి నేతలకు సవాల్ విసిరారు. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో కేసీఆర్‌ది మెరుపు వేగం అని , అమ‌లు చేయ‌డంలో రాకెట్ స్పీడ్ అని కేటీఆర్ అన్నారు. మాది గ‌ల్లీ పార్టీ..బిజెపి , కాంగ్రెస్ లది ఢిల్లీ పార్టీ అని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్, బీజేపీనో అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌తి దానికి ఛ‌లో ఢిల్లీ అంటారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ వ‌దిలిన బాణాలు. కానీ తెలంగాణ గ‌ల్లీ నుంచి ప్ర‌జ‌లు త‌యారు చేసిన బ్ర‌హ్మాస్త్రం కేసీఆర్ (KCR) అని అని సినిమా డైలాగ్ రేంజ్ లో కేటీఆర్ డైలాగ్ వదిలారు.

దేశంలో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిన మొట్ట‌మొద‌టి సీఎం కేసీఆర్..ప్ర‌పంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్..వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో నంబ‌ర్ వ‌న్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్..దేశంలో 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. అలాగే ప్ర‌పంచంలో ఎక‌రానికి రూ. 10 వేల పెట్టుబ‌డి ఇచ్చే రాష్ట్రం తెలంగాణ‌. రైతుల‌కు జీవిత‌ బీమా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ‌. ల‌క్షా నూట ప‌ద‌హార్ల కానుక ఇచ్చి 13 ల‌క్ష‌ల మంది ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్లు చేసిన రాష్ట్రం తెలంగాణ‌. ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్య‌ధికంగా క‌ల్పించిన రాష్ట్రం తెలంగాణ‌..ఇలా అన్ని ఇస్తున్నాం కాబట్టే ప్రతి ఒక్కరు కేసీఆర్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. అలాగే చంద్రబాబు , ఏపీ సీఎం జగన్ లకు ఈ సందర్బంగా థాంక్స్ తెలిపారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి గురించి వారు గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ మన ప్రతి పక్ష పార్టీలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేసారు.

Read Also : AP : సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చాడు – పవన్