Site icon HashtagU Telugu

Minister KTR : క్రీడాకారిణికి అండ‌గా నిలిచిన మంత్రి కేటీఆర్

Sports

Sports

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం చండూరులో ఫెన్సింగ్ క్రీడాకారిణి షేక్ నజియాకి మంత్రి కేటీఆర్ అండ‌గా నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా ఫెన్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు ప్రభుత్వ సహాయం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆమె ట్వీట్ చేసింది . దీనికి స్పందించిన కేసీఆర్ టీఆర్ఎస్ నాయ‌కులను ఆమె ఇంటికి పంపించారు. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి నజియాకి స్పోర్ట్స్ కిట్, రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంద‌జేశారు. కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో వ్యక్తిగత & టీం విభాగంలో కాంస్య పతకం సాధించిన నజియాను అభినందిస్తూ త్వరగా కోలుకుని మరల మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించాలని నాయ‌కులు భ‌రోసా ఇచ్చారు.

Exit mobile version