Site icon HashtagU Telugu

KTR: మోదీ’ పై మండిపడ్డ ‘కేటీఆర్’.. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు

1212

1212

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గానే ఉంటూ… వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా కేంద్రంపై ట్విట్టర్ వార్ ప్రకటించారు కేటీఆర్. వరుస ట్వీట్లతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌ లో పవర్ హాలీడే ప్రకటించడాన్ని విమర్శించిన మంత్రి కేటీఆర్.. మిషన్ భగీరథ పథకంలో కేంద్ర భాగస్వామ్యం గురించి ప్రజలకు చెప్పాలని ప్రధానికి ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న గుజరాత్‌ లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడం దేనికి నిదర్శనమని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది డబుల్ ఇంజినా లేక ట్రబుల్ ఇంజినా అని పరోక్షంగా భారతీయ జనతా పార్టీని నిలదీశారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యంపైనా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యం ఏంటో ప్రధాని మోదీ ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు ఈ పథకంలో కేంద్రం పాత్ర ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే అని చెప్పారు కేటీఆర్. జల జీవన్ మిషన్ ద్వారా 2019 నుంచి రాష్ట్రంలో 38 లక్షలకు పైగా తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రధాని మోదీ ప్రకటనపై స్పందించిన కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.