KTR on Malik: ఈ యువ ఆటగాడికి అభివందనం-మంత్రి కేటీఆర్..!!

ఉమ్రాన్ మాలిక్...ఈ కశ్మీర్ బుల్లెట్...గత ఐపీఎల్ వరకు అనామకుడు.

  • Written By:
  • Updated On - April 18, 2022 / 12:13 AM IST

ఉమ్రాన్ మాలిక్…ఈ కశ్మీర్ బుల్లెట్…గత ఐపీఎల్ వరకు అనామకుడు. కానీ ఈ సీజన్ త తన సంచలన పేస్ తో క్రికెట్ లవర్స్ నే కాదు…ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటున్నాడు. 150కిమీ వేగంతో బంతులు వేస్తూ…ప్రతి మ్యాచ్ లోనూ లక్షల రూపాయలు గెలుచుకుంటున్నాడు ఈ యంగ్ ప్లేయర్. అంతేకాదు వికెట్ల వేటలోనూ జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో పోరులో లాస్ట్ ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీసి…శభాష్ అనిపించుకున్నాడు.

ఈ తిరుగులేని ప్రదర్శనపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విపరీతమైన బలంతో ఉమ్రాన్ మాలిక్ విసిరే బంతులు నమ్మశక్యం కానీ రీతిలో ఉన్నాయంటూ మంత్రి కితాబిచ్చారు. అంతేకాదు బహుశా ఈ మ్యాచ్ అతడి ప్రదర్శన ఐపీఎల్ లోనే ది బెస్ట్ అయ్యుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ యువ ఆటగాడికి అభివందనం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ కూడా క్రికెట్ అభిమానినే. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఐపీఎల్ ను ట్రాక్ చేస్తున్నారు కేటీఆర్.