Site icon HashtagU Telugu

Bheemla Nayak: భీమ్లా నాయ‌క్‌ కోసం కేటీఆర్.. ఊగిపోతున్న పీకే ఫ్యాన్స్

Pawan Ktr

Pawan Ktr

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కల్యాణ్, డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం భీమ్లా నాయ‌క్. సినిమాకు సంబంధించి అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో, ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక మ‌రోవైపు విడుద‌ల రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్లు ముమ్మ‌రంగా చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక‌, ఈనెల 21తేదీ సోమ‌వారం నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో జ‌రిగే ఈ భారీ ఈవెంట్‌కు, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా భీమ్లా నాయ‌క్ నిర్మాత నాగ‌వంశీ తెలియ‌జేశారు. ఈ విష‌యం తెలిసిన పీకే అభిమానుల ఓ రేంజ్‌లో ఊగిపోతున్నారు. మ‌ళ‌యాలంలో ఘ‌న‌విజ‌యం సాధించి అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి స్కీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్ర‌మ్ అందిచారు. నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, త‌మ‌న్ సంగీతం అందించారు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేం సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.