Konda Surekha: మేడారం జాతరకు నిధులు మంజూరు చేయండి

మేడారం జాతరకు నిధులు కేటాయించాలని మంత్రి సురేఖ సీఎం రేవంత్ ను కోరారు.

  • Written By:
  • Updated On - December 14, 2023 / 11:08 AM IST

Konda Surekha: 2024 ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు నిధులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి అభ్యర్థించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే తొలి పండుగకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో సురేఖ ముఖ్యమంత్రికి అధికారికంగా లేఖ అందించగా, ఆయన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు.

నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెకు తీసుకురాగా, అదే రోజు పునుకొండల నుంచి పగిడిద్ద రాజు, నాగులమ్మ, గోవిందరాజులను కొండాయి నుంచి గద్దెకు నిర్వాహకులు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 22న సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 24న సమ్మక్క, సారలమ్మల  ఉత్సవాలు ముగుస్తాయి.

Also Read: CBSE Board Exam 2024: సిబిఎస్సీ 10, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే..? నిబంధనలు ఇవే..!