Komatireddy: బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్‌, నిధులపై నిలదీత

  • Written By:
  • Updated On - February 21, 2024 / 10:46 PM IST

Komatireddy: భువనగిరి ఖిల్లా మీద రోప్ వే వేసుకుందాం అని 200 కోట్లు అడిగానని.. కిషన్‌ రెడ్డి కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. నాలుగు ఏండ్ల నుండి ఫైల్ దగ్గర పెట్టుకున్నాడని, సొంత రాష్ట్రానికి 200 కోట్లు తెచ్చుకోలేక పోయాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద మాట్లాడటం సరికాదని, టచ్ చేసి చూడు మా ప్రభుత్వంని పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్ మంత్రిగా 200 కోట్లు అవ్వలేని వాడివి.. ఏం మాట్లాడుతున్నావని, గడ్కరీ దగ్గర 3000 కోట్ల పనులు తెచ్చుకున్నానన్నారు.

కానీ కిషన్ రెడ్డి 200 కోట్లు ఇవ్వలేదని, పిచ్చి మాటలు మాట్లాడకు కిషన్ రెడ్డి.. అవసరం అయితే ప్రధాని ని కలుస్తామని, నేషనల్ హైవే లు తెస్తామని, కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి రాలేదన్నారు.అంతేకాకుండా..’మోడీ మాట్లాడిన మాటలు ఆడియో చూపెట్టమని అంటావా. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ..ఇచ్చారా. 500 గ్యాస్..1200 చేసింది మీరు. బ్లాక్ మని తెస్తా అన్నాడు.. జనం బ్యాంకుల్లో ఖాత డబ్బులు కొట్టేశాడు మోడీ. రైతులు ధర్నా చేసినా పట్టించుకోలేదు. త్వరలోనే రెండు.. మూడు రోజుల్లో రెండు హామీలు అమలు చేస్తాం. కిషన్ రెడ్డి మూసి గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు. నమామి గంగా కి 4 వేల కోట్లు పెట్టారు. మూసి కి ఎందుకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.