Komatireddy: చిరును సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి

  • Written By:
  • Updated On - January 26, 2024 / 08:45 PM IST

Komatireddy: తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. పద్మవిభూషణ్‌తో పాటు చిరు చేసిన సేవలకు భారతరత్నతో పాటు మరిన్ని సన్మానాలు సాధించాలని కోరుకుంటున్నాను అని కోమటిరెడ్డి అన్నారు. చిరంజీవిని శాలువా, పూలబొకేతో సత్కరించారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిరంజీవికి శుభాకాంక్షలు” అని కోమటిరెడ్డి తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అపాయింట్‌మెంట్ కోరారు. ప్రభుత్వ స్థలాల్లో షూటింగ్‌కి అనుమతులు పొందేందుకు, పరిశ్రమకు పరిశ్రమ హోదా కోసం సింగిల్‌ విండో సిస్టమ్‌ కోసం చూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నంది అవార్డులను పునరుద్ధరిస్తుందని, పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తుందని టాలీవుడ్ పెద్దలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా నటుడిగా 150 కి పైగా సినిమాలతో ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు మానవతావాదిగా ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు వంటివి నెలకొల్పి అలానే పలు ఇతర సామజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ ఈ అవార్డుకు ఎంతో అర్హులని పలువురు కొనియాడుతున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ టీమ్ పద్మవిభూషణ్ అందుకోవడం పై ఆయనకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా శుభాభినందనలు తెలియచేసింది.