Site icon HashtagU Telugu

Minister Jogi Ramesh : చంద్ర‌బాబు కొత్త నాట‌కానికి తెర‌తీశారు – మంత్రి జోగి ర‌మేష్‌

Jogi Ramesh Imresizer

Jogi Ramesh Imresizer

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జ‌రిగిన రాళ్ల దాడి ఘ‌ట‌న‌పై మంత్రి జోగి ర‌మేష్ స్పందించారు. రాయి దాడితో చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఒక పక్క రెక్కీ, రెండో పక్కేమో రాయి అంటూ టీడీపీ, జనసేన నేతలు కుట్ర అంటూ గోల చేస్తున్నారని.. కానీ తెలంగాణ పోలీసులు కొంతమంది తప్పతాగి చేసిన గలాటాగా తేల్చారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు రాయి అంటూ కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాయి ఎవరితో వేయించుకున్నాడో తాము తేలుస్తామన్నారు. ఆయన బండారం బయటపెడతామని.. ఎన్టీఆర్ హయాంలో మల్లెల బాబ్జీ ఎపిసోడ్‌లో ఏం చేశారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు..