Site icon HashtagU Telugu

Erramatti Dibbalu : మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకు పవన్ కళ్యాణ్ – మంత్రి అమర్నాధ్ హెచ్చరిక

Gudivada Amarnath Fires On

Gudivada Amarnath Fires On

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై మరోసారి విమర్శలు చేసారు ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల సమస్యల పట్ల పోరాడుతూ..ప్రభుత్వానికి పలు డిమాండ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధువారం భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను (Erramatti Dibbalu) సందర్శించారు.

అనంతరం మీడియా తో (Pawan Kalyan) మాట్లాడుతూ..ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అని , అలాంటి వాటిని రక్షించుకునే అవగాహన ప్రభుత్వం లేదన్నారు. దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలకు చేరాయన్నారు. వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పవన్… ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయిస్తామని పవన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం 48 గంటల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వేల సంవత్సరాలుగా ఎర్రమట్టిదిబ్బలు సహజసిద్దంగా ఏర్పడ్డాయని, వైసీపీ నేతలకు వీటిని కాపాడుకోవాలన్న కనికరంలేకుండా విధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వకానికి వీఎంఆర్డీఏకు ఏం అవసరమని ప్రశ్నించారు.

పవన్ వ్యాఖ్యలపై మంత్రి అమర్ నాధ్ (Minister Gudivada Amarnath) విమర్శలు చేసారు. ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అక్కడ విఎంఆర్డిఏ (VMRDA) అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అని పవన్ ను ప్రశ్నించారు. ” మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ (Chandrababu Script) చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది.” అని అమర్ నాధ్.. పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో, ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, ప్రధాని మోడీ (PM Modi)కి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాలు పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ” మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.. అంతే కానీ అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి” అని మంత్రి అమర్ నాధ్..పవన్ కు సూచించారు.