ఆయనో మంత్రి.. చుట్టు గన్ మన్లు, అనుచరులు ఉన్నా కూడా ఫోన్ మాయం కావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తన సెల్ ఫోన్ లేదని గుర్తించారు. తన సెల్ ఫోన్ పోయిందని మంత్రి తన గన్ మెన్లకు తెలిపారు. Sri Bugulu Venkateswara Swamy Temple కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మొబైల్ పోయిందని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని మైక్ లో అనౌన్స్ చేయడంతో భక్తులందరూ ఆశ్చర్యపోయారు.
Errabelli: మంత్రి ఎర్రబెల్లి ఫోన్ మాయం

Errabelli Dayakar Rao