Site icon HashtagU Telugu

Hyderabad: క్వాంట‌మ్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

Errabelli Dayakar Rao Signa

Errabelli Dayakar Rao Signa

ఆర్టిఫీషియ‌ల్ ఇంజ‌లీజెన్స్‌, కొత్త సాంకేతిక‌ల నేప‌థ్యంలో మాన‌సిక ఒత్తిడిల‌ను త‌ట్టుకోవ‌డానికి, న‌యం చేసుకోవ‌డానికి క్వాంట‌మ్ ఉత్ప‌త్తుల‌ అవ‌స‌రం ఎంతో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఈ సేవ‌లు దేశంలో మొట్ట మొద‌టి సారిగా హైద‌రాబాద్ లో ల‌భించ‌డం కూడా సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ హెడ్ క్వార్ట‌ర్ అమెరికా న్యూ జెర్సీలో ఉంద‌ని, ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాల‌న్నీ ఇక్క‌డ ల‌భించ‌నున్నాయ‌ని మంత్రి తెలిపారు.

ఈ సేవ‌ల‌ను ప్ర‌జ‌లు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. క్వాంట‌మ్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహ‌కుల‌ను మంత్రి అభినందించారు. క్వాంట‌మ్ సేవ‌ల‌ను మంత్రి బుధ‌వారం మాదాపూర్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రితోపాటు రాజ్య‌స‌భ స‌భ్యులు ఒద్దిరాజు ర‌విచంద్ర‌, సినీ నిర్మాత దిల్ రాజు, నిర్వాహ‌కులు న‌రేంద‌ర్‌, సంజ‌య్‌, శివ ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read: MLC Kavitha: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కవిత, గాంధీ కుటుంబానికి సూటి ప్రశ్న