Site icon HashtagU Telugu

Errabelli Dayakar Rao: వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

Errabelli Dayakar Rao requested Nagarjuna for film studio in Warangal

పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ ఇవ్వాళ విడుదల చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను మరోసారి ఆశీర్వదించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగుతుండగా, ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఎమ్మెల్యేగా 7వ సారి..! కాగా, గతంలో ఒకసారి వరంగల్ ఎంపీ గా మంత్రి గెలిచారు. ఇంకోసారి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బరిలోకి దిగుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా…! రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపా…!! ఇంకో అవకాశం ఇస్తే, మీ సేవకుడి లా పని చేస్తా… ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు. పాలకుర్తి ప్రజలు మంచివారిని, తమకు మంచి చేసే వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని గుండెల్లో నిలుపుకుంటారని అన్నారు. తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కృతజ్ఞతలు…! ధన్యవాదాలు!! తెలిపారు. ఇదిలా ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పలువురు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను

ప్రతి గ్రామానికి రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, వివిధ గ్రామాలకు లింకు రోడ్లు వేయించి, మురుగు నీటి కాలువలు వేసి, కడిగిన ముత్యంలా చేశా..

పాలకుర్తి, బమ్మెర, వల్మిడి సాహిత్య, చరిత్ర ప్రాశస్త్యం అందరికీ తెలిసేలా టూరిజం కారిడార్ ను అభివృద్ది చేశాను

చరిత్ర కలిగిన దేవాలయాలకు పునర్ వైభవం తీసుకోచ్చాను

తొర్రూరు పురపాలక పట్టణాన్ని సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల ఆశీస్సులతో అభివృద్ది చేశాను

ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ, దేవాదుల నీళ్ళు అందించాను

నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాను

రిజర్వాయర్లు కట్టించి, చెరువులు నింపి, భూగర్భ జలాల అభివృద్ధికి పాటు పడ్డాను

గడపగడపకు సంక్షేమ పథకాలు అందించాను

అర్హులైన అందరికీ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కేసీఆర్ కిట్లు, రేషన్ కార్డులు అందజేశాను

రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాను

దళితులకు భూ పంపిణీ తో పాటు దళిత బంధు పథకాన్ని అందజేశాను

తాజాగా గృహలక్ష్మి పథకం కింద అర్హులైన అందరికీ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందజేస్తున్నాను

కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులు అందచేశాను

స్వంతంగా ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో Ro ప్లాంట్లను ఏర్పాటు చేశాను

నిరుద్యోగులకు శిక్షణ తరగతులు, మహిళలకు కుట్టు శిక్షణ శిబిరాలు, ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే ప్రయత్నం చేశాను.

ఉపాధి కూలీలకు లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అందించాను

ఎంతో చేశాను ఇంకా చేయాల్సింది ఉంది.

నన్ను మరోసారి గెలిపించండి

సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో BRS పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నా…

మరోసారి అవకాశం ఇస్తే మీ సేవకుడి లా పని చేస్తా… మీ రుణం తీర్చుకుంటాను.