Telangana Budget 2025 : తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ కావడం విశేషం. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నాం అన్నారు.
Read Also: 2025-26 Telangana Budget : 2025-26 బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
శాఖల వారీగా కేటాయింపులు ఇవే..
.పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
.వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
.విద్యాశాఖ- రూ.23,108కోట్లు
.మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
.పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు
.పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు
.కార్మికశాఖ- రూ.900 కోట్లు
.ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు
.ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
.బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
.చేనేత రంగానికి- రూ.371 కోట్లు
.మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
.పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు
.ఐటీ రంగం- రూ.774 కోట్లు
కాగా, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వార్షిక బడ్జెట్ ప్రతులను అందజేశారు. భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ ప్రతులను సమర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం భట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్ బాబు తదితరులు బడ్జెట్ కాపీలు అందజేశారు. అంతకుముందు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , స్పెషల్ సెక్రెటరీ రామకృష్ణ రావు , సందీప్ కుమార్ సుల్తానీయ , తదితరులు పాల్గొన్నారు.
Read Also: Sunita Williams On Earth: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్