Site icon HashtagU Telugu

Minister Ambati Rambabu : తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న మంత్రి అంబ‌టి రాంబాబు.. రాజ‌కీయాల కోసం శ్రీవారిపై..?

Srivari Seva Tickets

Srivari Seva Tickets

తిరుమ‌ల శ్రీవారిని మంత్రి అంబ‌టి రాంబాబు ద‌ర్శించుకున్నారు. ఆల‌య అధికారులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కొన్ని శక్తులు రాజకీయాల కోసం శ్రీవారి ఆలయం,శ్రీవాణి ట్రస్టుపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవాణి ట్ర‌స్ట్‌పై ఆరోపణలను ఆయ‌న ఖండించారు. కొందరు చెప్పిన మాటలను విని అవగాహన లేకుండా శ్రీవాణి ట్రస్టుపై బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని.. శ్రీవాణి ట్రస్టు వల్ల తిరుమలలో దళారీలు తగ్గారని మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగాంగ కొత్త ఆలయాలు,పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులను కేటాయిస్తున్నామ‌ని.. శ్రీవాణి ట్రస్టు గూర్చి మాట్లాడే రాజకీయ నాయకులకు స్వామివారే బుద్ది చెప్పుతారని అంబ‌టి రాంబాబు తెలిపారు.