Site icon HashtagU Telugu

Ambati : పవన్ వ్యక్తిగత తీరుపై కథ రెడీ..టైటిల్ ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’

Minister Ambati Rambabu Sensational Comments On Pawan Kalyan

Minister Ambati Rambabu Sensational Comments On Pawan Kalyan

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మరోసారి ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేసారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నుండి బ్రో (BRO) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో పృద్వి క్యారెక్టర్ పేరు శ్యామ్ బాబు అని పెట్టడం..అంబటి రాంబాబు డాన్స్ ను పోలిన డాన్స్ పెట్టడం తో ఇది కాస్త వివాస్పదం అయ్యింది. దీనిపై ఇప్పటికే మంత్రి అంబటి స్పందించగా..తాజాగా మరోసారి ఈ మూవీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.

మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ (YCP) ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ..బ్రో సినిమా అట్టర్ ప్లాప్ (Attar Flop) అయ్యిందని , రోజు రోజుకు సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయని , ఈ సినిమా నిర్మాత టీడీపీ కి చెందిన వ్యక్తి అని , పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్‌ ద్వారా అమెరికా నుండి తెప్పిస్తున్నాడని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కు పలు ప్రశ్నలు వేశారు.

తన సినిమాలకు బ్లాక్‌ మనీ (Pawan Black Money) వాడుతున్నారా..? ఇప్పటివరకు ఎంత డబ్బు తీసుకున్నారు..?.. బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారు..? అంటూ పవన్‌ను మంత్రి నిలదీశారు. బ్రో సినిమాతో తన శత్రువులను తిట్టాలని పవన్‌ అనుకున్నాడు. అందుకే సినిమా డిజాస్టర్ అయ్యిందని రాంబాబు ఎద్దేవా చేసారు. కనీసం పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని , అందుకే కాంట్రవర్సీ చేసి కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి పడుతున్నారన్నారు.

అక్కడితో ఆగకుండా పవన్ క‌ళ్యాణ్‌ వ్యక్తిగత తీరుపై కథ రెడీ సిద్ధం అవుతుందని.. ఈ సినిమాకు నిత్య పెళ్లికొడుకు, తాళి-ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు.. మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాంబాబు చేసిన వ్యాఖ్యలపై అభిమానులు , జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి..గోదావరి ఉధృతికి ముంపు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతూ కనీస అవసరాలు తీర్చడం లేదని , ఏ నేత పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇంకా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి..ఇవన్నీ వదిలిపెట్టి పవన్ సినిమా ఫై మీడియా సమావేశం పెట్టడం..పలు వ్యాఖ్యలు చేయడం ఏంటి మంత్రి గారు అని సామాన్య ప్రజలు , నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Read Also : AP BRS: సంక్షేమం పేరుతో ఏపీలో సంక్షోభ పాలన: బీఆర్ఎస్ చీఫ్ తోట ఫైర్