IT Notice to Chandrababu : చంద్రబాబు చంద్రమడలం వెళ్లిన అరెస్ట్ తప్పదు – గుడివాడ అమర్నాథ్

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ షోకాజ్(Show Cause notice) నోటీసులు ఇచ్చింది. వీటిపై చంద్రబాబు తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ(IT) తిరస్కరించింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu Arrest

Minister Amarnath about Chandrababu Arrest

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ షోకాజ్(Show Cause notice) నోటీసులు ఇచ్చింది. వీటిపై చంద్రబాబు తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ(IT) తిరస్కరించింది. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఒప్పుకున్నారు. ఈ నోటీసులు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్నాయి.

ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేయించే పనిచేస్తుందని చంద్రబాబు అనడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా చంద్రబాబు కబుర్లు చెపుతున్నాడని..నిజం ఎప్పటికి దాగదని..ఏరోజుకైనా అరెస్ట్ తప్పదని అంటున్నారు. తాజాగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాధ్ (Minister Gudivada Amarnath) దీనిపై స్పందించారు. చంద్రబాబు చంద్రమడలం వెళ్లిన అరెస్ట్ తప్పదని పేర్కొన్నారు. నేను తప్పు చేయలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై తోడు దొంగలు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. పవన్, సీపీఐ నారాయణ, పురంధేశ్వరి ఎందుకు మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ పేరుతో చంద్రబాబు సానూభూతి పొందే ప్రయత్నం చ్తేస్తున్నారని మంత్రి అమర్నాథ్‌ విమర్శించారు.

Read Also : YS Sharmila : హోంగార్డ్ రవీందర్ హత్యపై వైఎస్ షర్మిల కామెంట్స్.. కేసీఆర్ నియంత పాలనలో మరో ప్రాణం..

చంద్రబాబు ఐటీ నోటీసులకు సంబంధించి ఇద్దరు విదేశాలకు పరారయ్యారని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్, మనోజ్ పార్థసానీని ఎందుకు దేశం దాటించారని ప్రశ్నించారు. ఒకరిని దుబాయ్, మరొకరిని అమెరికా ఎందుకు పంపించారని నిలదీశారు. వారిని దేశాలు దాటించినా.. చేసిన తప్పు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు.

  Last Updated: 08 Sep 2023, 10:59 PM IST