Site icon HashtagU Telugu

AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌..!

Audimulapu Suresh Ap Eapcet 2022

Audimulapu Suresh Ap Eapcet 2022

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ క్ర‌మంలో ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఈ క్ర‌మంలోఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలిపారు.

ఇక ఆగష్టులో EAP సెట్‌ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు.ఇక‌పోతే గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, అయితే ఈసారి మ‌రిన్ని సెంట‌ర్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామ‌ని తెలిపిన మంత్రి ఆదిమూల‌పు సురేష్, ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశామన్నారు.