Site icon HashtagU Telugu

MLC Kavitha: వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత

Kavithabrs

Kavithabrs

MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరుతూ లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు.

కాగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యింది. అయితే ఆమె ఏ స్థానం నుంచి పోటీలో నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ప్రియాంక, లేదా రాహుల్ పోటీ చేస్తే, వారిపై పోటీకి దింపేలా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.