Site icon HashtagU Telugu

Bengaluru: బెంగుళూరులో బతకాలి అంటే ఎంత జీతం కావాలో తెలుసా?

Most Congested City In India

Most Congested City In India

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో నిత్య అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలీచాలని సంపాదనలతో చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిటీలలో ఉండేవారు అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. సిటీలలో హౌస్ రెంట్లు కరెంట్ బిల్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా వేళ్లలోనే ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో సిటీలలో ఉండేవారు చాలా వరకు కూడా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ జీతాలు అంతంత మాత్రం కానీ ఉండడంతో ఇల్లు కడవడం కూడా చాలా మందికి కష్టంగా ఉంటుంది.

ఇకపోతే ఈ విషయం గురించే ప్రస్తుతం ట్విట్టర్ లో చర్చలు జరుగుతున్నాయి. అదేమిటంటే ఇషాన్ శర్మ అనే క్రియేటర్, కోడర్.. బెంగళూరులో జీవించడానికి అవసరమైన కనీస జీతం గురించి ట్విటర్‌లో యూజర్లను అడిగారు. ఈ పోస్ట్‌కి కొన్ని యూజర్ల నుంచి ఆసక్తికరమైన రిప్లయిలు వచ్చాయి. 2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా పీజీలో ఉండే ఫ్రెషర్‌కు రూ.30,000, ఫ్లాట్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న బ్యాచిలర్లకు రూ. 50,000, పెళ్లయిన వారికి రూ. 75,000, టూబీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ. 1,00,000 ప్రతి నెలా చేతిలో ఉండాలని ఒక యూజర్‌ రాసుకొచ్చారు.

అయితే అక్కడ ఎంత సంపాదించినా కూడా తక్కువే అని మరో యూజర్‌ కామెంట్ చేసాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలను షేర్ చేశారు. అయితే ఎక్కువ శాతం మంది బెంగళూరు వంటి ఎంత సంపాదించినా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది అని రాసుకొచ్చారు. కొన్ని నెలల క్రితం జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఒక మహిళ చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్‌కు నెలకు రూ. 50,000 కూడా సరిపోదని ఆమె పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బెంగుళూరు లాంటి సిటీలలో బ్రతకడం చాలా కష్టం అని చెప్పవచ్చు.