Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి

నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Virasat Rasool Khan

Virasat Rasool Khan

Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.

1989లో తొలిసారిగా చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విరాసత్.. ఆ తర్వాత 2009లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.విరాసత్ రసూల్ ఖాన్ కుటుంబ విషయానికి వస్తే అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. విరాసత్ రసూల్ ఖాన్ మృతి పట్ల ఆ పట్ల చీఫ్ అసదుద్దీన్ ఒవైసి సంతాపం తెలిపారు. తన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

Also Read: Pushpa 2 : క్లైమాక్స్ షూటింగ్‌లో పుష్ప.. పార్ట్ 3కి కనెక్షన్ ఇచ్చేలా..!

  Last Updated: 28 May 2024, 06:59 PM IST