Opener Devon: గొప్ప ఆటగాడితో పోల్చడం నా అదృష్టం

' డేవాన్ కాన్వె బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతడు అచ్చం ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హస్సీలా ఆడుతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Devon Conway

Devon Conway

‘ డేవాన్ కాన్వె బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అతడు అచ్చం ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హస్సీలా ఆడుతున్నాడు. ‘ అనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డేవాన్ కాన్వె బ్యాట్ తో చెలరేగిన తీరును చూసి.. క్రికెట్ పండితులు ఈవిధమైన వర్ణనలు చేస్తున్నారు. 49 బంతుల్లో 87 రన్స్ చేసి.. తన జట్టు (csk) 20 ఓవర్లలో 208 పరుగులు సాధించడంలో డేవాన్ కాన్వె కీలక పాత్ర పోషించాడు. తనను మైక్ హస్సీ తో పోల్చడంపై డేవాన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ హస్సీ తో నన్ను పోలుస్తున్నారని చాలాసార్లు విన్నాను.

అటువంటి గొప్ప ఆటగాడితో నన్ను పోల్చడం నా అదృష్టం. హస్సీకి అని క్రికెట్ ఫార్మాట్లలో విస్తారమైన అనుభవం ఉంది. వాటిపై లోతైన అవగాహన ఉంది. హస్సీ తో మాట్లాడటం, ఆటకు సంబంధించి ఆయన నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి నేను తొలి ప్రాధాన్యమిస్తా. ఆయన నుంచి నేర్చుకుంటూ.. బాగా శ్రమించి అడతా’ అని డేవాన్ వ్యాఖ్యానించాడు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి 110 పరుగుల భాగస్వామ్యాన్ని డేవాన్ నెలకొల్పాడు. 17 ఓవర్ల దాకా ఔట్ కాకుండా నిలబడి.. మైదానం నలువైపులా పరుగుల వరద పారించాడు. అతడి 87 పరుగుల స్కోర్ కార్డులో 5 సిక్స్ లు, 7 ఫోర్లు ఉన్నాయి. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 117 పరుగులకే ఆల్ ఔట్ అయింది.

  Last Updated: 09 May 2022, 03:41 PM IST