Site icon HashtagU Telugu

Inspections : రాజమండ్రి సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తనిఖీలు..ఏం జరగబోతుంది..?

Superintendent Of Rajahmundry Jail Who Went On Leave

Superintendent Of Rajahmundry Jail Who Went On Leave

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అర్ధరాత్రి తనిఖీలు (Midnight inspections at Rajahmundry Central Jail) చెప్పడం ఇప్పుడు టీడీపీ (TDP) శ్రేణుల్లో మరింత భయానికి గురి చేస్తుంది. సాధారణ సమయాల్లో అధికారులు జైల్లో తనిఖీలు చేయడం చేస్తుంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో అది కూడా రీజియన్ జైల్ డీఐజి రవి కిరణ్ (Jail DIG Ravi Kiran) తనిఖీలు చేపట్టడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు (Chandrababu) పాత్ర ఉందని..వందల కోట్లు అవినీతి జరిగిందంటూ ఆయన్ను సీబీఐ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచగా..విచారణ విన్న న్యాయమూర్తి హిమబిందు..చంద్రబాబు కు రెండువారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. స్నేహ బ్లాక్ (Rajahmundry Central Jail Sneha Block) లో ప్రత్యేక గదిలో ఆయన్ను ఉంచారు. అయితే చంద్రబాబు జైల్లో ఉండడం ఆయనకు ప్రాణ హాని అని..వెంటనే ఆయన్ను హౌస్ రిమాండ్ కు తరలించాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ న్యాయమూర్తి మాత్రం అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిన్న మంగళవారం చంద్రబాబు ను ఆయన భార్య భువనేశ్వరి (bhuvaneswari), కొడుకు లోకేష్, బ్రహ్మణి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..భద్రతాపరమైన అనుమానాలే తమకు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు భువనేశ్వరి. జైల్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవన్నారు. లేనిపోని కేసులతో ఆయన్ను ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. జైల్లోనే ఆయన్ని కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు భువనేశ్వరి. ఈమె ఆవేదన తో టీడీపీ శ్రేణుల్లో చంద్రబాబు కు జైల్లో ఏంజరుగుతుందో అనే ఆందోళనకు గురి అయ్యారు.

Read Also : Skill Development Scam : చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం – డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్

ఇక నిన్న అర్ధరాత్రి స్నేహ బ్లాక్ లో రీజియన్ జైల్ డీఐజి రవి కిరణ్ తనిఖీలు చేపట్టడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. అసలు జైల్లో ఏంజరుగుతుందో..? చంద్రబాబు ను ఏంచేయబోతున్నారు..? అనే అనుమానాలు మరింత రేకెత్తిస్తున్నాయి. కానీ భద్రత దృష్ట్యానే తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి చంద్రబాబుకు జైల్ అనేది అంత సురక్షతం కాదని అంటున్నారు.