Microsoft & Netflix : నెట్‌ఫ్లిక్స్‌ కంపెనీ ని కొనబోతున్న మైక్రోసాఫ్ట్..!

మైక్రోసాఫ్ట్ 2023లో తన దూకుడును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ (Microsoft) 2023 లో తన దూకుడును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ టెక్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ను కొనుగోలు చేయవచ్చని రాయటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. గతంలోనూ మైక్రోసాఫ్ట్ అనేక కంపెనీలను కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేయటం వ్యూహాత్మకంగా మైక్రోసాఫ్ట్‌కు కలిసిరానుంది. పైగా దీని వల్ల నియంత్రణ అడ్డంకులు రావని తెలుస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 69 బిలియన్ డాలర్ల విక్రయం విషయంలో మాదిరిగా అడ్డంకులు ఉండవు. దీనికి తోడు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ నెట్‌ఫ్లిక్స్ బోర్డులో సీటు కలిగి ఉండటంతో రెండు కంపెనీలు ఇప్పటికే సన్నిహితంగా ఉన్నాయి. అడ్వర్టైజింగ్-సపోర్ట్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ కోసం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మైక్రోసాఫ్ట్ (Microsoft) బహుళ పరికరాల్లో వీడియో-గేమ్ స్ట్రీమింగ్ సేవను అందించాలనుకుంటోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే తన గేమింగ్ సర్వీస్ ద్వారా దీన్ని నిర్వహిస్తోంది. మక్రోసాఫ్ట్ గేమ్ పాస్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫ్ గేమింగ్ ని పోలి ఉంటుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే 20 మొబైల్ గేమ్‌లను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ లక్ష్యాలను చేరుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు ఎంతగానో దోహదపడనుంది. దీనిద్వారా స్ట్రీమింగ్ టీవీ, గేమ్‌లను కలిసి బండిల్ చేయడానికి వీలు ఏర్పడుతుంది.

ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు డీల్ పూర్తయితే Netflix AWS తో క్లౌడ్ అనుబంధాన్ని కలిగి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ కంటే 13 రెట్లు మార్కెట్ విలువను కలిగి ఉన్న మైక్రోసాఫ్ట్ దానిని సులువుగా కొనుగోలు చేయగలదు. 2024లో నెట్‌ఫ్లిక్స్ కోసం అంచనా వేసిన 8 బిలియన్ల నిర్వహణ లాభంపై పన్ను తర్వాత.. పెట్టుబడిపై మైక్రోసాఫ్ట్ 8% రాబడిని పొందనుందని తెలుస్తోంది. ఈ డీల్ కంపెనీకి నిజంగా చాలా కీలకంగా మారనుంది.

Also Read:  Business Idea : చిన్నటెక్నిక్ తో విదేశీ కూరగాయలను పండిస్తూ..లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతు..!!