Site icon HashtagU Telugu

Bill Gates Phone: సాంసంగ్ ఫోన్ వాడుతున్న బిల్ గేట్స్.. మోడల్ పై పూర్తి వివరాలివీ

Bill Gates

bill gates

“అన్న నడిచొస్తే మాస్.. అన్న విజిలేస్తే మాస్.. మమ మాస్” అన్నట్టు!! వీఐపీలు ఏది వాడితే.. అదే ట్రెండ్, అదే మాస్ లోకి బలంగా వెళ్తుంది!! ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, వ్యాక్సిన్ల నుంచి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ల దాకా సవాలక్ష వ్యాపారాల్లో వేళ్లూనుకు పోయిన అపర కుబేరుడు బిల్ గేట్స్ పై జనాసక్తి అంతాఇంతా కాదు. ఆయన ఆహారపు అలవాట్లు, జీవన శైలి, టైం టేబుల్ గురించి గూగుల్ లో నిరంతరం సెర్చ్ జరుగుతుంటుంది. ఈక్రమంలో “9to5google” అనే వెబ్ సైట్ బిల్ గేట్స్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గతవారం సోషల్ మీడియా పోర్టల్ “reddit” .. “ask me anything” అనే కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఇంటర్వ్యూ చేసింది. ” ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ ఏది ?” అని గేట్స్ ను ప్రశ్నించగా.. “Samsung Galaxy Z Fold 3” అని బదులిచ్చారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఫోన్లను తయారు చేస్తుంది. బహుశా.. ఆయన తన కంపెనీ ఫోన్ నే వాడుతుండొచ్చని భావించే వారందరికీ ఇది అంచనా వేయని జవాబే!! దీంతో గేట్స్ అభిమానులంతా గూగుల్ లో
“Samsung Galaxy Z Fold 3”
ఫోన్ మోడల్ గురించి సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇది “Microsoft Surface Duo” ఫోన్ కు దగ్గరి పోలికలు, ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర మన కరెన్సీ లో రూ.1.60 లక్షలు. Microsoft, Samsung కంపెనీలు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తి కి సంబంధించిన చాలా విషయాల్లో కలిసి పని చేస్తున్నాయి. పైగా “Samsung Galaxy Z Fold 3” ఫోన్ మోడల్ Microsoft విండోస్ కు సపోర్ట్ కూడా చేస్తుంది. మల్టీ యాక్టివ్ విండోస్ ఫీచర్ ఇందులో ఉంది. ఈ కారణం వల్ల ఆయన “Samsung Galaxy Z Fold 3” ను వాడుతుండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫీచర్స్ ఇవే..

* 12 జీబీ ర్యామ్, 256 జీబీ లేదా 512 జీబీ స్టోరేజ్
* ఫాంటమ్ బ్లాక్ కలర్, ఫాంటమ్ గ్రీన్ కలర్
* ఈ ఫోన్ ను ఫోల్డ్ చేసి ఉంచితే 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది.
* ఈ ఫోన్ ను అన్ ఫోల్డ్ చేస్తే 7.6 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ అందుబాటులోకి వస్తుంది.
* ఎలా వాడినా ఈ ఫోన్ రిఫ్రెష్ రేటు 120 హెర్ట్జ్
* 5 నానో మీటర్ల 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుంది.
* ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లో ఈ ఫోన్ నడుస్తుంది. అవసరం అని భావిస్తే ఆండ్రాయిడ్ 12కు అప్ డేట్ చేసుకోవచ్చు.
* ట్రిపుల్ లెన్స్ కెమెరా ఉంటుంది. 12 మెగా పిక్సెల్ కు చెందిన 3 లెన్స్ లు ఉంటాయి. వైడ్ యాంగిల్ లో ఫోటో షూట్ కు ఇవి ఎంతో అనువైనవి.
* ఫోన్ ముందు భాగంలో 2 ప్రత్యేకమైన సెల్ఫీ షూటర్ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి 10 మెగా పిక్సెల్, ఇంకొకటి 4 మెగా పిక్సెల్ క్లారిటీ కలిగినవి.

Exit mobile version