Site icon HashtagU Telugu

Zain Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత..!

Zain Nadella Death

Zain Nadella Death

మైక్రోసాఫ్ట్ సీఈవో భార‌త సంగ‌తికి చెంద‌ని సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశారు. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్, పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. ఈ క్రమంలో ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఇక అక్టోబర్ 2017లో, సత్య నాదెళ్ల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తన కొడుకు పుట్టుక‌ గురించి వెల్లడించారు. జైన్ ఆగస్ట్ 13, 1996న రాత్రి 11:29కి జన్మించినట్లు ఆ బ్లాగ్ లో పేర్కొన్నారు. సత్యనాదెళ్లకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక, 2014లో సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పట్టి నుంచి నాదెళ్ల వైకల్యాన్ని ఎదుర్కొంటున్నవారికి మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు.. తన కుమారుడు జైన్‌ను పెంచడం అతడికి మద్దతు ఇవ్వడంలో తాను నేర్చుకున్న పాఠాలను కూడా కొన్ని సందర్భాల్లో ఉదహరించారు సత్య. గత సంవత్సరం, జైన్ తన చికిత్సలో ఎక్కువ భాగం పొందిన చిల్డ్రన్స్ ఆస్పత్రితో కలిసి ఎండోడ్ చైర్‌ను తయారు చేయడానికి సత్య నాదెళ్ల పనిచేశారు.