టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇప్పటికీ అనేక దేశాలలో వింత ఆచారాలు మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని దేశాలలో అక్కడి ఆచారాలు సంప్రదాయాలు తెలిస్తే మాత్రం నూరేళ్లబెట్టాల్సిందే. అయితే మామూలుగా ప్రజలు వర్షాలు లేదంటే పంటలు పండడం కోసం మూగజీవాలను ఊరేగించడం లేదంటే మూగజీవాలకు పెళ్లిళ్లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అచ్చం అలాగే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా మొసలిని పెళ్లి చేసుకున్నారు.
మొసలిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎందుకు చేసుకున్నాడు అది ఆచారమా? లేకపోతే మరొకటా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దక్షిణ మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా అనే పట్టణంలో ఇలా మొసలిని పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. విక్టర్ హ్యూగో సోసా అనే మేయర్ చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో అలీసియా అడ్రియానా అనే ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకటి రెండు కాదన్నా ఏకంగా 230 ఏళ్లుగా పూర్వికుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ వివాహం ఆ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం.
ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్ రాజుగా, మొసలిని రాణిగా భావిస్తారు. కాగా ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. భద్రత కోసం దాని ముక్కుకు తాడును కడతారు. మత్స్యకారులు వలలతో నృత్యాల్లో పాల్గొంటారు. ఈ వేడుకను ఒక పెద్ద పండుగగా నిర్వహిస్తాం. వరుడు వధువు అనగా మొసలిని ఎత్తుకుని నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో పెళ్లి వేడుక ముగుస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆ ఘటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.