Site icon HashtagU Telugu

Under Water Metro: నదీగర్బంలో మెట్రో ట్రాక్.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?

Whatsapp Image 2023 04 23 At 21.17.11

Whatsapp Image 2023 04 23 At 21.17.11

Under Water Metro: ఇప్పటికే ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మెట్రో ట్రాక్‌లు ఆకాశ మార్గంలో నిర్మించగా.. తొలిసారి నదీగర్బంలో మెట్రో మార్గం వేశారు. భారత్ లో తొలిసారి కోల్‌కత్తాలో నదీగర్బంలో మెట్రో ట్రాక్ వేశారు. హుగ్లీ నదీ కింద మెట్రో మార్గం నిర్మించారు. ఈ ఏడాది కల్లా ఇది అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

నది లోపల నిర్మించిన మెట్రో ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కోల్‌కత్తాలోని తూర్పు, పశ్చిమ కారిడార్లను అనుసంధానించేందుకు 16.6 కిలోమీటర్ల పనులు చేపట్టారు. ఇందులో భాగంగా సాల్ట్ లేక్ సెక్టార్ వి ఐీ హబ్, హావ్ డా మైదాన స్టేషన్ల మధ్య హుగ్దీ నది లోప ప్రతిష్టాత్మ టన్నెలో రూపొందించారు. 520 మీటర్ల పొడవు ఉండే ఈ టన్నెల్ ద్వారా 45 సెకన్లలో మెట్రో పరుగులు తీస్తుంది. నదీ గర్భానికి 33 మీటర్ల లోతులో ఇది ఉంటుంది. నీళ్లు రాకుండా 1.4 మీటర్ల వెడల్పు గల కాంక్రీటు రింగులను అమర్చారు. అలాగే నీటిని పీల్చుకునేందుకు హైడ్రోఫిలిక్ గాస్కెట్లను తగిలించారు.

ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. హావ్ డా నుంచి సెల్ధాకు రోడ్డు ద్వారా వెళ్లాలంటే 1.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ టన్నెల మార్గం ద్వారా మెట్రోలో 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీని ద్వారా ట్రాఫిక్ కూడా బాగా తగ్గుతుంది. టన్నెల్ అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు ఉంటుంది. ఇక బాహ్య వ్యాసం 6.1 మీటర్లు ఉంటుంది. జర్మనీలో రూపొందించిన బోరింగ్ మిషన్ల ద్వారా 66 రోజుల్లో టన్నెల్ ను తవ్వారు. అలాగే అనివార్య కారణాల వల్ల మెట్రో ఆగిపోతే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పక్కన నడక మార్గం ఏర్పాటు చేశారు.

Exit mobile version