నూతన సంవత్సరం వేడుకలను (New Year Celebrations) పురస్కరించుకుని హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైల్వే గుడ్ న్యూస్ అందించింది. నూతన సంవత్సరం సందర్భాంగా హైదరాబాద్ మెట్రో (HYD Metro)రైళ్లు రాత్రి 12:30 వరకు సేవలు అందించనున్నట్లు HMRL వర్గాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం నగరవాసులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వారి భద్రతను కాపాడే దిశగా తీసుకోబడింది. అర్థరాత్రి వేడుకలు జరిగే సందర్భంలో నగరవాసులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రో సేవలు ఎంతో దోహదపడనున్నాయి. ఈ నిర్ణయం ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు భద్రతను కల్పించేందుకు మద్దతు ఇస్తుంది. నూతన సంవత్సర వేడుకల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగవచ్చని భావించిన మెట్రో రైల్వే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
ఇక నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. రేపు రాత్రి ఫ్లై ఓవర్లను మూసివేస్తామని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఈ మేరకు తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని సూచించారు. నగరంలో నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవడానికి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయబడనున్నాయి. వేడుకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు.
Read Also : Mega vs Allu : అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ తోపా ?