ఉగాది కొత్త సంవత్సరం ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. నింగి నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలతాకుతూ కనువిందు చేశాయి. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి ప్రాంతాల్లో ఈ సీన్ కనిపించింది. రష్యా-ఉక్రెయిన్ మీద మిస్సైళ్లతో బాంబులువేస్తున్నప్పుడు ఇలాంటి సీన్ కనిపించింది. కానీ ఇవి ఉల్కలు, ఆయుధాలు కావు. నిప్పులు కక్కుతూ నేలరాలాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి వాసులు ఈ సీన్ కెమెరాల్లో బంధించి తెగ సంతోష పడ్డారు.
చీకటిపడిన సమయం నుంచి వితలవారీగా ఈ ఉల్కాపాతం కనిపించింది. ఒక్కోఉల్క రాలిపడుతుంటే…సంబరపడుతూ కెమెరాలు చేతబట్టారు. ఆ విజువల్స్ రికార్డు చేస్తూ స్థానికులు తెగ ఎంజాయ్ చేశారు. ఒక దశలోపదుల సంఖ్యలో పెద్దెత్తున నేలరాలాయి. 8 గంటల 6 నిమిషాల సమయంలో పెద్దెత్తున ఉల్కాపాతం చూపరులకు కనువిందు చేసింది. కెమెరా కంటికి ఓ భారీ ఉల్కాపాతం చిక్కింది.
https://twitter.com/Sejal0224/status/1510271857768878081